![]() |
![]() |
.webp)
ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఏవి ట్రెండింగ్ లోకి వెళ్తాయో అర్థం కాదు. ఓ అమ్మాయి నిల్చున్న, మాట్లాడినా, ఆటలాడిన చివరికి ఏం చేసినా వైరల్ అవుతుంటాయి. అలాంటిది వ్యవసాయ రంగంలో పాపులర్ అయిన ఫార్మర్ నేత్ర మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు ఫార్మర్ నేత్ర(Farmer Nethra) .. వారధి ఫామ్స్( vaaradhi ) ని సొంతంగా స్టార్ట్ చేసిన నేత్ర అటు ప్రమోషన్స్.. ఇటు సేల్ తో బిజీగా ఉంటోంది. అయితే ఈ మధ్య వారధి ఫామ్స్ లోని మామిడికాయలో ప్రమోషన్ లో భాగంగా ఇన్ స్టాగ్రామ్ లో నేత్ర ఓ వీడియో చేయగా అది ఫుల్ వైరల్ అవుతోంది. చిన్న రసాలు, పెద్ద రసాలు, నవని, బెంగినపల్లి అంటు తన ఫామ్ లోని మామిడి పండ్ల గురించి నేత్ర చెప్పింది. అయితే ఈ వీడియోని తీసుకొని సోషల్ మీడియా ట్రోలర్స్ ఇతర వీడియోలు చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన ఫార్మర్ నేత్రే కన్పిస్తుంది. తనకి ఇన్ స్టాగ్రామ్ లో 490K ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏ రీల్ చేసిన మినిమమ్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి.
గత కొన్ని రోజుల నుండి ఫార్మర్ నేత్ర ఈ బిగ్ బాస్ - 8 కి వెళ్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. మోటివేషనల్ స్పీకర్ వంశీతో పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని నెలలకే వాళ్ళు విడిపోయింది. ఇప్పుడేమో తన ఇన్ స్టాగ్రామ్ లో సొరకాయ సూప్ ఎలా చేయాలో ఓ వీడియోని షేర్ చేసింది. అయితే నేత్ర ఈ వీడియోలో ఏం అందంటే.. ఛీ సొరకాయనా అని మీరందరు అనుకుంటారు. కానీ తినాలి .. హెల్తీ యు నో అని వీడియో స్టార్ట్ చేసింది. అయితే తను అలా అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేశారు. కొందరు సమంతలా ఉందని, మరికొందరేమో మరీ ఇంత క్యూట్ గా ఉండకూడదని, సొరకాయలో కాస్త మామిడిపండు వేస్తే అదిరిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో అప్లోడ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్ ని దాటేసింది. నెటిజన్లు దేనికి ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాదని ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మరి మీరు చూసేయండి.
![]() |
![]() |